News March 6, 2025
ఓటమి మరింత బాధ్యతను పెంచింది: నరేందర్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్‌గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని, పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News March 6, 2025
NRPT: మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని చెప్పారు. నారాయణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 245 గ్రామాలు రెండు మున్సిపాలిటీలకు నీటి సరఫరా ఉండదని చెప్పారు.
News March 6, 2025
నాకౌట్ మ్యాచుల్లో కుల్దీప్ ఫెయిల్.. మరో బౌలర్‌ను తీసుకోవాల్సిందేనా?

టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అంతగా రాణించట్లేదు. అతడి రికార్డులు 2023 వన్డే WC సెమీఫైనల్లో 1/56, ఫైనల్లో 0/56, 2024 టీ20 WC సెమీఫైనల్లో 3/19, ఫైనల్లో 0/45, CT-2025 సెమీఫైనల్లో 0/44గా ఉన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాను తీసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మీరేమంటారు?
News March 6, 2025
HYD: ORRపై యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

రావిర్యాల ORR ఎగ్జిట్ 13 వద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం.. ORRపై చెట్లకు నీళ్లు పడుతున్న సిబ్బందిని కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కార్ డ్రైవర్, కోప్యాసింజర్, ఫ్లాగ్ మ్యాన్ మృతిచెందారు. ఘట్కేసర్ వద్ద 3:15కు కార్ ఎంట్రీ అవ్వగా.. 3:30కి యాక్సిడెంట్ జరిగిందని, 15 MINలో దాదాపు 37 కి.మీ చేరుకునేంత ఓవర్ స్పీడ్‌లో వచ్చాడని అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.