News September 22, 2025

ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలి: DRO

image

ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అనకాపల్లి DRO సత్యనారాయణరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ఓటరు జాబితా అభ్యంతరాలపై సమావేశం ఏర్పాటు చేశారు. జాబితాలో పొరపాట్లు, తప్పులు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు.

Similar News

News September 22, 2025

రామగుండం: సైబర్ వారియర్స్‌కు సీపీ ప్రోత్సాహం

image

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సైబర్ వారియర్స్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. సోమవారం జరిగిన సమావేశంలో వారికి టీజీసీఎస్‌బీ పంపిన టీషర్టులను పంపిణీ చేశారు. ఇటీవల 134 కేసుల్లో ₹41.81 లక్షలు బాధితులకు తిరిగి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఉత్తమంగా పనిచేసిన నలుగురు కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

News September 22, 2025

ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జూలై నెలలో నిర్వహించిన పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను యూనివర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, పీజీ డిప్లమా ఇన్ గైడెన్స్ ఇన్ కౌన్సిలింగ్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్కు ఆసక్తి ఉన్న విద్యార్థులు వచ్చే నెల ఆరో తేదీలోపు రూ.1860 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 22, 2025

రెండు రోజుల క్రితం లేఖ.. ఇవాళ హతం

image

ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదంటూ ప్రకటించిన రెండు రోజులకే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా <<17796054>>రామచంద్రారెడ్డి<<>> ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఆయుధాలు వదిలేస్తామంటూ అభయ్ పేరుతో ఇటీవల లేఖలు కలకలం రేపాయి. ఆ ప్రకటన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఈ నెల 20న లేఖ విడుదల చేశారు. అది తాజాగా బయటకు రావడం, ఆయన మరణించడం చర్చనీయాంశమైంది.