News December 10, 2025
ఓటర్లు ఇవి వెంట తెచ్చుకోవాలి: ADB కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఫొటో, గుర్తింపు కార్డు చూపాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఓటర్ పేరు తన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ జాబితాలో తప్పనిసరిగా ఉండాలన్నారు. EPIC (ఓటర్ ID) లేనివారు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ ఫొటో, PAN కార్డు, MNREGA జాబ్ కార్డు వంటి 18 ప్రత్యామ్నాయ ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాలన్నారు.
Similar News
News December 14, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే? …

జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో 20.27 శాతం పోలింగ్ నమోదయింది. బోయినపల్లి మండలంలో 18.25%, ఇల్లంతకుంట మండలంలో 23.81%, తంగళ్ళపల్లి మండలంలో 18.57% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,04,905 మంది ఓటర్ల గాను 21,268 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 14, 2025
మెదక్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ నమోదు

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు సగటున 21.83 % పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా ఓటింగ్ శాతం ఇలా ఉంది. తూప్రాన్ 25.49 %, మనోహరాబాద్ 23.03 %, చేగుంట 19.52 %, నార్సింగి 18.04 %, రామాయంపేట్ 22.14 %, నిజాంపేట్ 18.56 %, చిన్నశంకరంపేట్ 20.85 %, మెదక్ 27.99 % పోలింగ్ నమోదైంది.
News December 14, 2025
నిర్మల్ జిల్లాలో 23.99% పోలింగ్

నిర్మల్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 23.99 శాతం పోలింగ్ నమోదయింది. నిర్మల్ గ్రామీణ 22.22 శాతం, సారంగాపూర్ 21.59 శాతం, సోన్ 23.03 శాతం, దిలావర్పూర్ 23.84 శాతం, కుంటాల 22.16 శాతం, నర్సాపూర్ (జి) 27.70 శాతం, లోకేశ్వరం మండలంలో అత్యధికంగా 28.06 శాతం పోలింగ్ నమోదయింది.


