News December 21, 2025
ఓటర్లు తీర్పు ఇచ్చారు.. అప్పులు గుండెల్లో గునపాలు దించాయి!

కామారెడ్డి జిల్లాలో జీపీ ఎన్నికల ఫలితాలు పల్లెల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గెలిచిన వారు సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి “ముందు నుయ్యి వెనుక గొయ్యి”లా మారింది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో శక్తికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులు, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఎవరిని కదిలించినా “పైసలు పాయె.. పదవి రాకపాయె” అనే చర్చ సాగుతోంది.
Similar News
News December 25, 2025
వేములవాడ: దర్శనాల దందాపై ఆలయ అధికారుల విచారణ

వేములవాడ భీమేశ్వర ఆలయంలో <<18666174>>బ్లాక్‌లో<<>> దర్శనాలు చేయిస్తున్న వ్యవహారంపై ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. వరంగల్‌కు చెందిన 8 మంది భక్తుల వద్ద 300 రూపాయల చొప్పున వసూలు చేసి దర్శనానికి తీసుకు వెళుతున్న చింతల్ ఠాణాకు చెందిన యువకుడుని అదుపులోకి తీసుకుని విచారించగా బ్లాక్ దందా ముఠాలో 8 మంది ఉన్నట్లు తేలింది. దీంతో ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది.
News December 25, 2025
పశువులకు ‘జోన్స్’ వ్యాధి ఎలా సోకుతుంది?

పాడి పశువులు సాధారణంగా మురికినీరు, శుభ్రంగా లేని మేత తీసుకోవడం వల్ల జోన్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి అన్ని రకాల పశువులకు సోకుతుంది. సాధారణంగా గేదెల్లో రెండు ఈతల తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లికి ఈ వ్యాధి ఉంటే పుట్టే దూడకు సోకుతుంది. దీంతోపాటు సహజ, కృత్రిమ సంపర్కం ద్వారా కూడా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. సహజంగా పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వ్యాధి వస్తుంది.
News December 25, 2025
గోదావరిలో రామయ్య తెప్పోత్సవానికి హంస వాహనం సిద్ధం

భద్రాద్రి రామయ్య వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన తెప్పోత్సవం కోసం గోదావరి తీరంలో హంస వాహనం ముస్తాబవుతోంది. ఈ నెల 29న జరిగే జలవిహారం కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం ఈవో దామోదర్ హంస వాహనాన్ని పరిశీలించి, భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం బారికేడ్లు, క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు.


