News December 31, 2025
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా తయారీపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రచురణలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. వివిధ పార్టీల నేతలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
విశాఖలో న్యూఇయర్ వేళ దారుణ హత్య

విశాఖలో న్యూఇయర్ వేళ దారుణ హత్య జరిగింది. విమాననగర్‌కి చెందిన దిలీప్ తన స్నేహితులు రమణ, బాలరాజుతో కలిసి గురువారం మధ్యాహ్నం మందు తాగాడానికి వెళ్లాడు. కాసేపటికే రక్తం మడుగులో దిలీప్ పడి ఉన్నట్లు స్థానికులు ఆయన కుటుంబానికి సమాచారం అందించారు. వెంటనే KGHకి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎయిర్ పోర్ట్ పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతుడి భార్య చంద్రిక ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News January 2, 2026
ఈ ఫ్రూట్స్‌తో క్యాన్సర్ దూరం

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, పనస, వాక్కాయలు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
News January 2, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


