News October 25, 2025
ఓటర్ జాబితాను పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలి: కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్ తో పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ ఆర్ వో, ఏఈఆర్‌వో, డిప్యూటీ తహశీల్దారులు, BLO, పంచాయతి కార్యదర్శులు, సూపర్వైజర్లతో రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
Similar News
News October 26, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 26, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.59 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
✒ ఇష: రాత్రి 7.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు
News October 26, 2025
ఆస్ట్రేలియాతో టీ20లకు అందుబాటులో నితీశ్!

గాయం కారణంగా ఆసీస్‌తో మూడో వన్డేకు దూరమైన <<18098198>>నితీశ్<<>> రెడ్డి ఈ నెల 29 నుంచి జరిగే 5 మ్యాచుల T20 సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముందని cricbuzz తెలిపింది. ఒకవేళ తొలి మ్యాచులో ఆడకపోయినా, ఆ తర్వాత మ్యాచుల్లో పాల్గొనే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు మూడో వన్డేలో క్యాచ్ తీసుకుంటూ గాయపడిన <<18098991>>శ్రేయస్<<>> కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని, SAతో నవంబర్ 30న ప్రారంభమయ్యే ODI సిరీస్‌లో ఆడొచ్చని అంచనా వేసింది.
News October 26, 2025
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్: అజీజ్

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమిద్ యాక్ట్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదర్సాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.


