News August 5, 2025
ఓటింగ్‌పై జీవీఎంసీ కార్పొరేటర్లకు అవగాహన

జీవీఎంసీలో బుధవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఓటింగ్ విధానంపై కార్పొరేటర్లకు GVMC అదనపు కమిషనర్ రమణమూర్తి మంగళవారం అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు ఓటర్ ఐడెంటిఫికేషన్ ఐడి కార్డును చూపించి లోపలకి వెళ్లాలన్నారు. ఒక ఓటరు 10ఓట్లు మాత్రమే వేయాలని, అంతకన్నా ఎక్కువ వేస్తే బ్యాలెట్ చెల్లదన్నారు.
Similar News
News August 5, 2025
విశాఖ సిటీ పోలీసులకు వార్షిక వైద్య పరీక్షలు

విశాఖ సీపీ డా.శంఖబ్రత బాగ్చి చొరవతో కేజీహెచ్, ఏఎంసీ సహకారంతో సిటీ పోలీసులకు యాన్యువల్ హెల్త్ చెకప్ మంగళవారం ప్రారంభమైంది. సుమారు 2700 మంది సిబ్బందికి ఈ నెలాఖరులోగా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి రోజున 150 మంది సిబ్బంది పాల్గొన్నారు. 2024లో ప్రారంభించిన కార్యక్రమం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించగలిగామని, ఈసారి మరిన్ని పరీక్షలు చేస్తామని సీపీ పేర్కొన్నారు.
News August 5, 2025
పారా అథ్లెటిక్స్‌లో సత్తా చాటాలి: కలెక్టర్

విశాఖ వేదికగా పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్‌లో ఆగష్టు 9న రాష్ట్ర స్థాయి 6వ జూనియర్, సబ్-జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పోటీల గోడ పత్రికను కలెక్టర్ హరీంద్రప్రసాద్ ఆవిష్కరించారు. విశాఖ వేదికగా జరిగే ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు.
News August 5, 2025
విశాఖ: రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రౌండ్ సర్కిల్ వద్ద రోడ్డుపై నడుస్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.