News May 13, 2024

ఓటు వేయడం మనందరి బాధ్యత: వేణుగోపాల్

image

ఓటు వేయడం మనందరి బాధ్యత అని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 171వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వచ్చి వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

Similar News

News October 28, 2025

ANU: దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జులై, ఆగస్టులో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు మంగళవారం విడుదల చేశారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మ్యాథమెటిక్స్, ఎంసీఏ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్, ఫలితాలు తదితర వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుండి పొందువచ్చని చెప్పారు.

News October 28, 2025

GNT: జిల్లా ప్రజలకు ముఖ్య సూచన.. అత్యవసరమైతేనే

image

మొంథా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు ప్రయాణాలపై పరిమితులు విధిస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారులపై భారీ వాహనాలు నడపకూడదని, ముందుగానే సురక్షిత లే బే ప్రాంతాల్లో నిలిపి వేయాలని తెలిపింది. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది.

News October 28, 2025

గుంటూరు: 92 కేంద్రాలకు 6 వేల మంది తరలింపు

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 పునరావాస కేంద్రాలకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల మంది నిర్వాసితులను తరలించారు. కేంద్రాల్లో వారికి తాగునీరు, ఆహారం, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా నేతృత్వంలో యంత్రాంగం సేవలు అందిస్తోంది.