News May 7, 2024

ఓటు హక్కును వినియోగించుకోండి: కలెక్టర్ హరి నారాయణన్

image

నెల్లూరులో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులందరూ 8వ తేదీలోగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలన్నారు.

Similar News

News October 22, 2025

నావూరు పెద్దవాగును పరిశీలించిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల

image

పొదలకూరు మండలం నావూరుపల్లి వద్దనున్న నావూరు పెద్దవాగును బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అవడంతో ఆమె వాగును‌ పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 22, 2025

25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

News October 22, 2025

మనుబోలు: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

మనుబోలు మండలం కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బొలెరో, బైక్ ఢీకొనడంతో బుధవారం అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. గొట్లపాలెం నుంచి కాగితాల పూర్‌కు బైకుపై హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న కాగితాల పూర్‌కి చెందిన కొండూరు సుప్రజ(40) మృతిచెందగా, కొడుకు రాకేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.