News December 10, 2025
ఓటు హక్కు వినియోగానికి 18 రకాల కార్డులు: కలెక్టర్

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువపత్రాల్లో దేనినైనా ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎలక్షన్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పోస్ట్ ఆఫీస్/బ్యాంకు పాస్ బుక్, పాన్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటోతో కూడిన కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు.
Similar News
News December 11, 2025
జిల్లాలో అత్యల్పానికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. గాంధారి 7.3°C, దోమకొండ, లచ్చపేట 7.4, డోంగ్లి 7.6, ఎల్పుగొండ 7.7, బీర్కూరు 7.8, మేనూర్, జుక్కల్ 7.9, నస్రుల్లాబాద్ 8, బొమ్మన్ దేవిపల్లి 8.3, నాగిరెడ్డిపేట 8.7, రామలక్ష్మణపల్లి 8.9, సర్వాపూర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్ 9, రామారెడ్డి, పుల్కల్, మచాపూర్ 9.1, మాక్దూంపూర్ 9.3°C ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News December 11, 2025
పెద్దపల్లి: పోలింగ్ సరళి పరిశీలిస్తున్న కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో గురువారం రోజున ఐదు మండలంలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సరళిని కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ తెలిపారు.
News December 11, 2025
రావణుడు లంకకు మొదటి నుంచే రాజా?

లంకకు అసలు రాజు, పుష్పక విమానానికి యజమాని ‘కుబేరుడు’. ఆయన విశ్రవసుడు, ఇళవిడ కుమారుడు. అయితే విశ్రవసుడు, ఆయన రెండో భార్య కైకసిలకు రావణుడు జన్మించాడు. రావణుడు కఠోర తపస్సు చేసి అపారమైన శక్తులు, వరాలు పొందాడు. ఆ వరాల గర్వంతో కుబేరుడిని బెదిరించి, లంకా రాజ్యాన్ని, పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. ఇలా లంకాధిపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆయన మొదటి నుంచే లంకకు రాజు కాదు.


