News June 3, 2024

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ ఏర్పాట్లను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News January 20, 2025

నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 97 ఫిర్యాదులు

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని ASP సౌజన్య , DTC DSP గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 97 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ మోసాలు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News January 20, 2025

ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న కృతిశెట్టి, సంయుక్త

image

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సూళ్లూరుపేటకు ప్రముఖ హీరోయిన్లు రానున్నారు. వారిలో ఉప్పెన ఫేం కృతిశెట్టి, విరూపాక్ష ఫేం సంయుక్త సింగర్ మంగ్లీతోపాటూ పలువురు ఢీ తారాగణం ఉన్నారు. వారితోపాటూ యాంకర్ రవి, కావ్య సందడి చేయనున్నారు. మరోవైపు మంత్రులు ఆనం, అనగాని సత్య ప్రసాద్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

News January 19, 2025

ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే 

image

సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు.