News June 4, 2024

ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించిన కలెక్టర్లు

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అనిశెట్టి దుప్పలపల్లి కౌంటింగ్ కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావుతో కలిసి నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజక వర్గాల కౌంటింగ్ ను ప్రత్యేకంగా ఆ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.

Similar News

News December 30, 2025

NLG: డీసీసీబీ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

రైతు సంక్షేమమే DCCB ప్రధాన లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. NLGలో అధికారుల సమావేశంలో ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’పై సమీక్ష జరిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. బ్యాంకు ఆర్థిక పురోగతికి రికవరీలు ముఖ్యమని, క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లా సాంకేతిక కమిటీ తీసుకున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేయాలన్నారు.

News December 29, 2025

నల్గొండ జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రబీ సీజన్‌లో జిల్లాకు అవసరమైన యూరియాను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరఫరా చేస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 13,936 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించారు. అధికంగా యూరియా విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు, లైసెన్సుల రద్దు చేస్తామని హెచ్చరించారు.

News December 29, 2025

NLG: యాప్ సమస్యలు వీడాలి.. కొనుగోళ్లు సాఫీగా సాగాలి: కలెక్టర్

image

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన రూ.66 కోట్ల అపరిష్కృత ఖాతాల సొమ్మును సంబంధిత వారసులకు చేరేలా అవగాహన పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజావాణిలో ఆమె పలు శాఖల పనితీరుపై సమీక్షించారు. పత్తి రైతులకు ఇబ్బందిగా మారిన యాప్ సమస్యలను పరిష్కరించాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. రహదారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.