News April 2, 2025
ఓడరేవు సొసైటీ సీఈఓని ట్రాప్ చేసి దోచేసిన మహిళ

అమలాపురానికి చెందిన ఓడరేవు సొసైటీ సీఈవోని కుమారి అనే మహిళ నిలువుదోపిడీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 17న మద్యం తాగి పానీపూరి బండి దగ్గరకు వచ్చిన సొసైటీ సీఈవోని కాకినాడకు చెందిన మహిళ ట్రాప్ చేసింది. ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తు బిల్లలు, గడ్డి మందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్లాక రూ.లక్ష నగదు, ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరు అరెస్టయ్యారు.
Similar News
News September 18, 2025
విశాఖ: ప్రేమ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్

అగనంపూడి యువతిని మోసం చేసిన మర్రిపాలేనికి చెందిన దుల్లా కిషోర్ కుమార్, అతడి స్నేహితులను దువ్వాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు.. కిషోర్ యువతిని ప్రేమ పేరుతో గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు. దీనికి శతీష్, వెంకటేష్ సహకరించారు. మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిని స్టేషన్‌కు పిలిపించారు. మద్యం తాగి యువతిని బెదిరించడమే గాక అడ్డువచ్చిన పోలీసులపై తిరగబడ్డారు.
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై గళమెత్తనున్నారు. కొడికొండ వద్ద 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. మరోవైపు YCP నాయకులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత ప్రకటించారు.