News January 14, 2026

ఓడలరేవు తీరంలో ‘కైట్ ఫెస్టివల్’

image

అల్లవరం మండలంలోని ఓడలరేవు సముద్ర తీరంలో బుధవారం నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి, వారితో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు తగు జాగ్రత్తలు పాటించి, ప్రమాదాలకు తావులేకుండా వేడుకలు జరుపుకోవాలని ఎంపీ సూచించారు.

Similar News

News February 21, 2026

MHBD: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు అనుష్క

image

జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో కంటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అనుష్క ప్రతిభ చాటింది. 6వ తరగతి చదువుతున్న అనుష్క తన అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు HM ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ఘనంగా అభినందించారు.

News February 21, 2026

అథ్లెటిక్స్‌లో సిద్దిపేట జిల్లాకు రెండు పతకాలు

image

హనుమకొండలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు సత్తా చాటారు. రెండో రోజు జిల్లాకు చెందిన ఇద్దరు పతకాలు సాధించినట్లు కోచ్ వెంకటస్వామి తెలిపారు. అండర్-16 బాలుర షాట్‌పుట్ విభాగంలో చేర్యాల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రణయ్ కుమార్ వెండి పతకం సాధించగా, బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో చింతమడక కేవీఆర్‌ఎస్ జెడ్‌పీహెచ్ఎస్ విద్యార్థిని చక్రిక కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

News February 21, 2026

VZM: డ్రైవింగ్ శిక్షణలో లోపాలు బట్టబయలు

image

విజయనగరం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, అర్హతలేని శిక్షకులతో శిక్షణ ఇవ్వడం వంటి లోపాలు గుర్తించారు. దీంతో 3 డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. రోడ్డు భద్రత కోసం నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.