News December 24, 2024
ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో టెండర్లకు ఆహ్వానం
ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వివిధ అంశాలపై టెండర్ నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారులు తెలిపారు. ఆలయంలోని టెంకాయలు, గుమ్మడికాయలు, కిరాణా షాపులు, వాహన పార్కింగ్ లైసెన్స్ హక్కు, కూల్ డ్రింక్స్, పూల దండలు, తల్లి ఆరాధన లైసెన్స్ హక్కు సహ పలు వాటికి ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల నాయకులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 24, 2024
BREAKING.. వీణవంకలో దారుణం.. వ్యక్తిపై గొడ్డిలితో దాడి
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో వెంకటరాజురెడ్డి అనే వ్యక్తిపై ముగ్గురు దుండగులు గొడ్డలితో దాడి చేసి చేతి వేళ్లు నరికేశారు. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం హనుమకొండకు తరలించారు. కాగా, బాధితుడు సీడ్ వ్యాపారిగా తెలుస్తోంది. చేతి నాలుగు వేళ్లు కట్ అవగా.. బొటన వేలు ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 24, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. @ కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. @ కరీంనగర్ ప్రజావాణిలో 333, సిరిసిల్ల ప్రజావాణిలో 142 ఫిర్యాదులు. @ ట్రాఫిక్ పోలీస్ విధులలో చేరిన ఎండపల్లి మండల ట్రాన్స్ జెండర్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి. @ బాధ్యతలు స్వీకరించిన మెట్పల్లి, మల్లాపూర్ నూతన ఎంపీడీవోలు.
News December 24, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైమ్ న్యూస్
☞JGTL: డ్రైనేజీలో పడేసి బండరాళ్లతో యువకుడు పై దాడి ☞JMKT: గుంపుల క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు☞మల్లాపూర్: బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష☞కమలాపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు ☞మద్దికుంటలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య ☞వీణవంక: చల్లూరు లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని వ్యక్తి మృతి☞మంథనిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా