News December 18, 2025

ఓదెల సర్పంచ్‌గా డా.సతీష్ ఘన విజయం

image

ఓదెల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా డా.సతీష్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు డా.సతీష్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

Similar News

News December 19, 2025

‘పంచాయతీ ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి’

image

గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల కోసం చేసిన ఖర్చుల వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరికీ ఎంపీడీవో కార్యాలయాల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజులలోగా ఎన్నికల ఖర్చుల సమగ్ర వివరాలను ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలని అందులో పేర్కొన్నారు.

News December 19, 2025

ANU: బీ ఫార్మసీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబరు నెలలో జరిగిన బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. విడుదల చేసిన I, IV సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో 70.98% ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 30వ తేదీ లోపు రూ.2,070 నగదు చెల్లించాలన్నారు. వివరాలకు వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.

News December 19, 2025

జంగారెడ్డిగూడెం: రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆలయ ఈవో RV చందన తెలిపారు. ఈ మేరకు 1568 జీవో విడుదల చేసినట్లు చెప్పారు. ఈనెల 20 నుంచి 20 రోజుల్లోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా ఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.