News October 18, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ చదవడానికి దరఖాస్తులు ఆహ్వానం

ఓపెన్ టెన్త్, ఇంటర్ (2025–26)లో చదవడానికి ఆసక్తి గలవారు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్ తెలంగాణ ఓపెన్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ (2025-26) విద్యా సంవత్సరానికి జిల్లాలో 1780 మందికి అవకాశం కల్పించగా, ఇప్పటివరకు కేవలం 1065 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 18, 2025
ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా కల్చర్ సాగు చేసేవారు కచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఆక్వా కల్చర్ అభివృద్ధి చేయుటకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు వేసినట్లు తెలిపారు. లైసెన్సుల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 18, 2025
ఊరిస్తున్న రికార్డులు.. కోహ్లీ అందుకుంటాడా?

విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత AUS సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయనను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
*మరో 54 runs: ODIల్లో అత్యధిక రన్స్ లిస్టులో సెకండ్ ప్లేస్.
*68 runs: లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ల (ODI, T20)లో ఫస్ట్ ప్లేస్‌కు. సచిన్ (18,436) తొలి స్థానంలో ఉన్నారు.
*సెంచరీ: ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు(సచిన్-51), ఆసియా వెలుపల ఎక్కువ సెంచరీలు చేసిన Asian బ్యాటర్‌గా (సచిన్-29) రికార్డు
News October 18, 2025
‘సూర్యలంక బీచ్‌లో షూటింగ్‌లకు వసతులు కల్పించండి’

పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌లో సినిమా షూటింగ్‌లకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించవలసిందిగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ను సినీ దర్శకుడు, మా-ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా కోరారు. శనివారo బాపట్ల కల్టెక్టర్‌ను కలిసి వినతి అందజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిలో సూర్యలంక బీచ్ భాగం కాగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వినతి ఇచ్చిన వారిలో నటుడు మిలటరీ ప్రసాద్ ఉన్నారు.