News April 5, 2025

ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారుల ఆదేశించారు. జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహణపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

Similar News

News April 5, 2025

నెల క్రితం పెళ్లి.. వివాహిత ఆత్మహత్య!

image

కదిరి మండలం బోయరామన్నగారిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ (18) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా యువతి 45 రోజుల క్రితం కూటాగుళ్లకు చెందిన చిన్న అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు మాట్లాడలేదని మనస్తాపం చెంది ఉరేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

News April 5, 2025

ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్

image

* కండరాలను రిలాక్స్ చేసేందుకు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
* నవ్వేందుకు కాస్త సమయం కేటాయించండి.
* ధ్యానం, శ్వాస వ్యాయామాలు (గ్రౌండింగ్ టెక్నిక్స్) పాటించండి.
* అనవసరమైన బాధ్యతలు తీసుకోకుండా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి.
* నమ్మకమైన వ్యక్తితో మీ భావాలు పెంచుకోండి. పాజిటివ్ మాటలు పంచుకోండి.

News April 5, 2025

TTD దర్శన సిఫార్సులు ఇకపై ఆన్‌లైన్‌లో..

image

TG: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రజాప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను ఆన్‌లైన్‌లో జారీ చేసేలా CMO ఓ ప్రత్యేక పోర్టల్ cmottd.telangana.gov.in రూపొందించింది. ఇకపై సిఫార్సు లేఖల్ని ఇందులో నమోదు చేయాల్సిందే అని CMO స్పష్టం చేసింది. ఈ పోర్టల్ నుంచి భక్తులు, దర్శన వివరాలతో జారీ అయ్యే లేఖలనే TTD అంగీకరిస్తుందని చెప్పింది. ఈ లేఖలతో సోమవారం నుంచి గురువారం వరకు దర్శనాలు కల్పిస్తారు.

error: Content is protected !!