News November 19, 2024

ఓపెన్ స్కూల్లో తత్కాల్ అడ్మిషన్స్ కోసం మరో అవకాశం

image

రంపచోడవరం : AP సార్వాత్రిక విద్యాపీఠము ( APOSS ) ద్వారా 2024-25 విద్యాసంవత్సరానికి తాత్కాల్ ప్రవేశం పొందేందుకు DEO బ్రహ్మాజీరావు సోమవారం షెడ్యూల్‌ను ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. పది, ఇంటర్మీడియట్ లో చేరాలనుకునేవారికి ఇది మరో అవకాశం అన్నారు. www.apopenschool.ap.gov.in లో లాగిన్ అయ్యి ₹600 లేట్ ఫీజుతో నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ చూడాలన్నారు.

Similar News

News January 28, 2025

గంగవరం: రైతుని గాయపరిచిన అడవి పంది

image

గంగవరం మండలం దొనేపల్లి గ్రామంలో పొలంలోకి వెళ్లిన బి.విష్ణు దొర, అనే వ్యక్తిని పిల్లలు కలిగిన అడవి పంది తీవ్రంగా గాయపరిచింది.  108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి కిషోర్ పైలట్ త్రిమూర్తులు హుటాహుటిన క్షతగాత్రుడిని దగ్గరలోని గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. 

News January 28, 2025

రాజమండ్రి: మహిళ నుంచి రూ.2.5కోట్లు దోపిడీ.. నిందితుల అరెస్ట్

image

CBI అంటూ మహిళ నుంచి రూ.2.5కోట్లు దోచుకున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని భయపెట్టి ఆమె నుంచి రూ.2.5 కోట్ల దోచుకున్నారు. రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రూ.24.5 లక్షల నగదు, కారు, రెండు ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లులోని బాధిత మహిళ రూ.26 లక్షలు ఫ్రీజ్ చేశారు.

News January 28, 2025

రంగంపేట: స్మశానవాటికలో స్కూల్ నిర్మాణంపై ఫిర్యాదు

image

రంగంపేట రెవెన్యూ కార్యాయంలో అధికారులు సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. పాతకోటపాడులోని సర్వే నంబర్ 44లో 2.71ఎకరాలను పలు సామాజిక వర్గాలు శ్మశానంగా వినియోగిస్తున్నాయి. అదే స్థలాన్ని హైస్కూల్ నిర్మాణానికి కేటాయించడంపై సహించేది లేదని తహశీల్దార్ కోను అనసూయకు ఇండియన్ యాక్ట్స్ ఆవెర్నెస్ వలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుందేటి వెంకట రమణ వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు.