News March 16, 2025

ఓయూలో ఏకమవుతున్న విద్యార్థి సంఘాలు !

image

ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నాయి. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.

Similar News

News March 16, 2025

HYD: వాతావరణ శాఖ చల్లటి కబురు

image

మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖగుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

News March 16, 2025

ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యం: కిషన్ రెడ్డి

image

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని, చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. గాంధీనగర్​ సురభి బాలవిహార్​ స్కూల్​ దగ్గర SRK గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​ ఉదాన్​ ఉత్సవ్​–2025 కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు.MLA ముఠా గోపాల్​, రిటైర్డ్​ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్​ రెడ్డి పాల్గొన్నారు.

News March 16, 2025

రేపు ఓయూ బంద్‌కు ఏబీవీపీ పిలుపు

image

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలపై నిషేధం విధిస్తూ ఓయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. యూనివర్సిటీల్లో నియంతృత్వ పోకడలు సరికాదని పేర్కొంది. ఓయూలో ఉద్యోగ భర్తీ, నిధుల కొరత, విద్య నాణ్యత, ఆహార నాణ్యత తదితరాంశాలపై దృష్టి సారించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.

error: Content is protected !!