News September 9, 2025
ఓయూలో నిపుణులను తయారు చేయడమే లక్ష్యం: వీసీ

విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేసే నిపుణులుగా తీర్చిదిద్దడమే AI, ML& డేటా అనలిటిక్స్‌లోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం లక్ష్యమని ఓయూ వీసీ ప్రొ. కుమార్ మోలుగరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంజినీరింగ్ కళాశాలకు అభినందించారు. సర్టిఫికేషన్ కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించి మరింత ప్రాక్టికల్ నైపుణ్యాలు అందిస్తామన్నారు. ఇందులో ఏఐ లింక్ బృందం కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు.
Similar News
News September 9, 2025
HYD: స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది

పోకిరీల ఆట కట్టించేందుకు వెస్ట్ జోన్‌లోని షేక్‌పేట్, ఖైరతాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. రాత్రివేళల్లో అతివేగంతో వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వెయ్యికిపైగా కేసులు నమోదు చేశారు. వాహనాన్ని సీజ్ చేసి, చలాన్ కట్టిన తర్వాతే తిరిగి అప్పగిస్తున్నారు. ఈ డ్రైవ్‌ను 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 నెలలుగా నిర్వహిస్తున్నారు.
News September 9, 2025
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక.. ఈనెల 17 వరకు అవకాశం

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ యువతకు కీలక సూచనలు చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈనెల 17 వరకు అవకాశం ఉందని కర్ణన్ తెలిపారు. ఈ సంవత్సరం జులై 1కి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువత కచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.
News September 9, 2025
HYD: 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

HYDలో నీటి డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పెరగనుందని జలమండలి అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు 600 MGD నీరు అవసరం కాగా.. 2027 నాటికి 835 మిలియన్ గ్యాలన్లకు(316 కోట్ల లీటర్లు) డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. 2047 నాటికి ఇది 1114 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనాలు రూపొందించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి 300 మిలియన్ గ్యాలన్ల అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.