News August 13, 2025

ఓయూలో వివిధ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బీఎస్సీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీఎస్సీ ఏవియేషన్ కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News August 13, 2025

VKB: ‘భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి’

image

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

News August 13, 2025

గూగుల్‌ క్రోమ్ కోసం ‘పెర్‌ప్లెక్సిటీ AI’ భారీ ఆఫర్

image

GOOGLE క్రోమ్ కోసం పెర్‌ప్లెక్సిటీ AI సంస్థ 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ బ్రౌజర్‌కు అది చాలా తక్కువ కావొచ్చు. కానీ, పెర్‌ప్లెక్సిటీకి చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారో కూడా వెల్లడించలేదు. ఆన్‌లైన్ సెర్చ్‌లో గుత్తాధిపత్యం సరికాదని.. క్రోమ్‌ను అమ్మేయాలని గతేడాది US కోర్ట్ సూచించింది. దానిపై ఆ సంస్థ పోరాడుతుంది గానీ, బ్రౌజర్‌ని అమ్మదని నిపుణులు చెబుతున్నారు.

News August 13, 2025

నల్గొండ: మెంటల్ రాజేశ్ అరెస్టు.. రెండు నెలల రిమాండ్

image

పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్న రౌడీ షీటర్ నలపరాజు రాజేశ్ అలియాస్ ‘మెంటల్ రాజేశ్’ను నల్లగొండ పోలీసులు వైజాగ్‌లో అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా కోర్టు విచారణలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న అతడిపై జిల్లా కోర్టు నాన్-బేలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నిందితుడి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అతడిని అరెస్ట్ చేశారు.