News August 13, 2025
ఓయూలో వివిధ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ

HYD ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బీఎస్సీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీఎస్సీ ఏవియేషన్ కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News August 13, 2025
HYD: ఇంజనీరింగ్ వైపు ఆసక్తి తగ్గుతుందా?

ఇంజినీరింగ్ విద్య వైపు ఆసక్తి తగ్గుతుందా? అంటే ప్రస్తుత గుణాంకాలతో అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 55.8% మాత్రమే సీట్ల భర్తీ అయ్యాయి. మిగిలినవి స్పాట్ కౌన్సెలింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే 15 శాతానికిపైగా సీట్లు గ్రేటర్ పరిధిలో మిగిలాయి. మరోవైపు B TECH ఇంజినీరింగ్ సీట్లు సైతం మిగలటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
News August 13, 2025
VKB: ‘భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి’

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
News August 13, 2025
గూగుల్ క్రోమ్ కోసం ‘పెర్‌ప్లెక్సిటీ AI’ భారీ ఆఫర్

GOOGLE క్రోమ్ కోసం పెర్‌ప్లెక్సిటీ AI సంస్థ 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ బ్రౌజర్‌కు అది చాలా తక్కువ కావొచ్చు. కానీ, పెర్‌ప్లెక్సిటీకి చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారో కూడా వెల్లడించలేదు. ఆన్‌లైన్ సెర్చ్‌లో గుత్తాధిపత్యం సరికాదని.. క్రోమ్‌ను అమ్మేయాలని గతేడాది US కోర్ట్ సూచించింది. దానిపై ఆ సంస్థ పోరాడుతుంది గానీ, బ్రౌజర్‌ని అమ్మదని నిపుణులు చెబుతున్నారు.