News January 25, 2025
ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
Similar News
News February 20, 2026
MDK: ఇంటికి వచ్చిన రోజే మృతి

కౌడిపల్లి మండల పరిధిలోని రాజీపేటలో మంతరి సత్యనారాయణ (29) అనే యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన సత్యనారాయణ, రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందారు. అనంతరం ఇంటికి వచ్చిన రోజే మృతి చెందడంతో తండ్రి శంకరయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లి చిన్నప్పుడే మరణించగా, ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా దూరమవ్వడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.
News February 20, 2026
ఇవాళ కూడా నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 158పాయింట్లు కోల్పోయి 82,339 వద్ద, నిఫ్టీ 35పాయింట్లు నష్టపోయి 25,419 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, HCL టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న కూడా సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోవడంతో రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
News February 20, 2026
సంగారెడ్డి: 25 నుంచి EXAMS.. ఫోన్‌కు హాల్ టికెట్స్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం శుక్రవారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీటిని తీసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


