News January 10, 2025
ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లకు నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.
Similar News
News January 10, 2025
HYD: కన్హా శాంతి వనంలో మెడిటేషన్ FREE
HYD నగర శివారులో శంషాబాద్ నుంచి చేగూరు వెళ్లే మార్గంలో దాదాపు 1600 ఎకరాల్లో విస్తరించి ఉన్న కన్హా శాంతి వనంలో మెడిటేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి రుసుము లేదన్నారు. ఒకేసారి లక్షమంది మెడిటేషన్ చేసే ఇలా ఇందులో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ఉచిత శిక్షణ, వసతి సదుపాయం సైతం కల్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతతను పొందడానికి ఇదొక చక్కటి ప్రాంతంగా అభివర్ణించారు.
News January 10, 2025
HYD: జనవరి 31న పిల్లలకు నుమాయిష్ ఎగ్జిబిషన్ FREE
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఘనంగా కొనసాగుతోంది. జనవరి 31న పిల్లలకు ‘స్పెషల్ డే’గా ప్రకటించారు. పిల్లలు ఉచితంగా వెళ్లే అవకాశం కల్పించారు. కాగా, ఇటీవల జనవరి 9న లేడీస్ ‘స్పెషల్ డే’గా నిర్వహించిన సంగతి తెలిసింది. ఈసారి ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది.
News January 10, 2025
HYD: సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఇలా తెలుసుకోండి!
HYD నగరం నుంచి MGBS, JBS, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు, గచ్చిబౌలి, ఆరాంఘర్, బోయిన్పల్లి తదితర ప్రాంతాల నుంచి సంక్రాంతికి నేటి నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. వరంగల్, హనుమకొండ, నల్గొండ, మంచిర్యాల, భూపాలపల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలు తెలుసుకునేందుకు 040-69440000, 040-23450033కు కాల్ చేయాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.