News October 25, 2025
ఓయూ: ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News October 25, 2025
ద్రాక్షారామ ఆలయ ఆవరణలో వ్యక్తి మృతి

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం దొంగ భీమన్న అనే కార్మికుడు గడ్డి మిషన్‌తో గడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆలయ సిబ్బంది వెంటనే ద్రాక్షారామ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఎం. లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
News October 25, 2025
అడవినెక్కలంలో లారీ, బైక్ ఢీ.. మహిళ మృతి

ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో శనివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నున్న గ్రామానికి చెందిన దేవశెట్టి ప్రమీల దేవి (60) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. నెక్కలం అడ్డరోడ్డులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భార్యాభర్తలు ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ప్రమీల దేవి మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 25, 2025
మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్‌పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.


