News October 23, 2025
ఓయూ ఎంబీఏ పరీక్షల ఫీజు స్వీకరణ

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ మేకప్, ఇన్‌స్టంట్ పరీక్షా ఫీజును ఈనెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.800 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
సిరిసిల్ల: ‘ప్రతి పేద మహిళ సంఘాల్లో చేరాలి’

జిల్లాలోని ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ కోరారు. జిల్లాలోని సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా దివ్యా దేవరాజనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు.
News October 24, 2025
PDPL: ‘2030 నాటికి తెలంగాణకు రూ.లక్ష కోట్లు’

లైఫ్ సైన్సెస్ సంస్థ ఆస్‌బయోటెక్, విక్టోరియా ప్రభుత్వ నిర్వహణలో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో PDPL జిల్లాకు చెందిన IT మంత్రి శ్రీధర్‌బాబు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం ఇచ్చారు. లైఫ్ సైన్సెస్‌లో 2030 నాటికి తెలంగాణకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి, 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
తిరుమలకు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ RRR

రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా గాయత్రి అతిథి భవనం వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారి ఓఎస్‌డీ సత్రే నాయక్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన రాత్రి తిరుమలలో బస చేసి శుక్రవారం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు.