News April 2, 2024

ఓయూ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

Similar News

News April 14, 2026

రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

image

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లో RRకు 5TH ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. RR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 74723 మంది పరీక్షలు రాయగా 60981 మంది పాసై 81.61 శాతంతో స్టేట్‌లోనే 5th ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 3042మందికి 2279 మంది పాసై 74.92%తో 15వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 7,246మందికి 2106 మంది పాసై 29.06%తో 26వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 223 మందికి 115 మంది పాసై 51.57%తో 17వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ 1st ఇయర్ ఫలితాల్లో RRకి 2nd ర్యాంక్

image

ఇంటర్ 1st ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెగ్యులర్ 1st ఇయర్ విద్యార్థులు 80,096 మంది పరీక్షలు రాయగా 61,177 మంది పాసై 76.38 శాతంతో స్టేట్‌లోనే సెకండ్ ర్యాంక్‌లో నిలిపారు. ఇక ఒకేషన్‌లో 3,946 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,438 మంది విద్యార్థులు పాసవ్వడంతో 61.78 శాతంతో స్టేట్‌లో 16వ స్థానంలో నిలిచింది.