News October 9, 2025

ఓయూ LLM పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని LLM పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. LLM 2, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

Similar News

News October 10, 2025

HYD, మేడ్చల్, రంగారెడ్డిలో 12న పోలియో వ్యాక్సిన్

image

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. 3 జిల్లాల పరిధిలో 12న ఐదేళ్లలోపు పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు. ఈ ప్రోగ్రాం కోసం ప్రత్యేక సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. నిండు ప్రాణాలకు- రెండు చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.

News October 10, 2025

పటాన్‌‌చెరు LIGలో పేలుడు

image

పటాన్‌చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 9, 2025

రేపటినుంచి చార్మినార్‌ సర్కిల్‌ అటవీ శాఖ క్రీడా పోటీలు

image

అటవీ శాఖ చార్మినార్‌ సర్కిల్‌ ప్రాంతీయ క్రీడా పోటీలు ఈ నెల 10, 11 తేదీల్లో దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో జరుగనున్నాయి. పరుగు పందెం, నడకపోటీ, వెయిట్‌ లిఫ్టింగ్, షటిల్, క్యారమ్స్, చెస్, లాన్‌టెన్నీస్, టేబుల్‌ టెన్నీస్, రైఫిల్‌ షూటింగ్, అర్చరీ, వాలీబాల్, బాస్కెట్‌ బాల్, కబడ్డీ, హాకీ, టగ్‌ ఆఫ్‌ వార్, సైక్లింగ్, మారథాన్‌ తదితర పోటీలు నిర్వహించనున్నారు.