News October 24, 2025
ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.
Similar News
News October 25, 2025
టోర్నమెంట్‌లో రన్నర రప్ గా మాడుగుల టీమ్

ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్ ఆప్ గా నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీవీఎస్ఎస్.శాస్త్రి తెలిపారు. రన్నర్ ఆప్ గా నిలిచిన కళాశాల టీం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్ చేతుల మీదుగా రూ.30వేల చెక్కును అందుకున్నారు.
News October 25, 2025
నాగుల చవితి సందర్భంగా VMRDA పార్కుల్లో ఉచిత ప్రవేశం

నాగుల చవితి పండగ సందర్భంగా నగరవాసుల సౌకర్యార్థం శనివారం VMRDA పరిధిలోని అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. నాగుల చవితి పురస్కరించుకుని ప్రజలు పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో వస్తారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీచ్ రోడ్ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.
News October 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


