News March 10, 2025
ఓరుగల్లులో భూముల ధరకు రెక్కలు!

WGL జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మామునూరులో దాదాపు రూ.2కోట్లకు పైనే ధర పలుకుతున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. భూ నిర్వాసిత గ్రామాల రైతులు మాత్రం ఎకరాకు రూ.5 కోట్లు ఇవ్వాలని, తమ గ్రామం నుంచే హైవే వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News October 28, 2025
పాలేరు జలాశయంలో భారీ చేప

కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన జాలరి మేకల పరశురాములుకు పాలేరు జలాశయంలో భారీ చేప లభించింది. వేటకు వెళ్లగా ఆయన వలలో 19 కేజీల మీసాలజెల్ల చేప చిక్కింది. దీని ధర కేజీ రూ.200 ఉంటుందని పరశురాములు వెల్లడించాడు. ఇలా మీసాలతో ఉండే చేపలు జలాశయంలో అరుదుగా లభ్యమవుతాయన్నాడు.
News October 28, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే

పార్వతీపురం మన్యం జిల్లాలో 24గంటల్లో 438.5mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అత్యధికంగా సీతంపేట 49mm, అత్యల్పంగా జిఎం వలస11.5mm, గరుగుబిల్లి 48.8mm, పాలకొండ32.6mm వర్షం పడిందన్నారు. భామిని37.8mm, వీరఘట్టం 29.6mm,గుమ్మలక్ష్మీపురం 14.2mm, కొమరాడ -15.2mm, కురుపాం-12.4mm,పాచిపెంట 42.4mm,సాలూరు22.4mm, పార్వతీపురం-25.6mm,మక్కువ 25.4mm, సీతానగరం 28.00mm,బలిజిపేట-44.2mm నమోదయ్యిందన్నారు.
News October 28, 2025
భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్

హీరోయిన్లకు యాక్షన్ సీన్లుంటే వాటికోసం స్టంట్ ఉమన్లు ఉంటారు. కానీ 50ఏళ్ల క్రితం ఓ మహిళ ఇలా స్టంట్లు చేసిందంటే నమ్ముతారా? ఆమే భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్ రేష్మా పఠాన్. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 400 కి పైగా చిత్రాల్లో ఆమె స్టంట్లు చేశారు. షోలే సినిమా తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆమె సేవలకుగాను ‘ఫిలిం క్రిటిక్స్ గిల్డ్’ రేష్మాను ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డుతో సత్కరించింది.


