News December 24, 2025

ఓరుగల్లు వాసులకు శుభవార్త.. 27న భూముల అప్పగింత

image

మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం భూములను అప్పగించేందుకు ముహూర్తం ఖరారైంది. 230ఎకరాలను సేకరించిన అధికారులు ఈనెల 27న ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించనున్నట్లు సమాచారం.దీని పరిధిలో ఇప్పటికే 690ఎకరాలు ఉండగా మరో 250ఎకరాలు కావాలని ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి 230ఎకరాలు సేకరించగా మిగతా భూమి ప్రభుత్వానికి చెందింది.దీంతో ఓరుగల్లు వాసుల ఎయిర్‌పోర్ట్ కల నెరవేరనుంది.

Similar News

News December 28, 2025

PHOTOS: బాలరాముడిని దర్శించుకున్న చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య రామజన్మ భూమి మందిరాన్ని సందర్శించారు. ఆలయం మొత్తం కలియతిరిగి అక్కడి శిల్పకళను తిలకించారు. అనంతరం బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అద్భుతమైన అయోధ్య ఆలయంలో బాలరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సీఎం ట్వీట్ చేశారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంటాయని పేర్కొన్నారు.

News December 28, 2025

ESIC హాస్పిటల్ తిరునెల్వేలిలో ఉద్యోగాలు

image

ESIC హాస్పిటల్, తిరునెల్వేలి 27 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 5న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. స్పెషలిస్ట్ పోస్టులకు గరిష్ఠ వయసు 67ఏళ్లు కాగా.. Sr. రెసిడెంట్(3Yr కాంట్రాక్ట్)కు 45ఏళ్లు, Sr. రెసిడెంట్(1Yr కాంట్రాక్ట్)కు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: rodelhi.esic.gov.in/

News December 28, 2025

నిర్మలా సీతారామన్‌పై మంత్రి పయ్యావుల ప్రశంసలు

image

కోవిడ్ సంక్షోభంలో దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో కష్టపడ్డారని మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. ఆదివారం పీఎం లంకలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కూటమికి ప్రజలు వేసిన ఓటు వల్లే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు వస్తున్నాయని తెలిపారు. గతంలో రక్షణ శాఖ, ప్రస్తుత్తం ఆర్థిక శాఖల బాధ్యతలను నిర్మలమ్మ సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.