News August 22, 2024

ఓర్వకల్లులో భారీ అగ్ని ప్రమాదం.. సంస్థ ప్రకటన

image

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జై రాజ్ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఎవరికీ గాయాలు కూడా అవ్వలేదని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాల ప్యానల్స్ మాత్రమే కాలిపోయాయని సంస్థ ప్రతినిధి శ్రీనివాస కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News

News February 18, 2026

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

image

కల్లూరు మండలం బస్తిపాడులోని గ్రామ సచివాలయంలో కలెక్టర్ ఏ.సిరి మండల సమాఖ్య పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలతో ఆమె మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి, వాటిని ఆపాలన్నారు. చదువురాని వారు అక్షరాంధ్రలో ఎన్‌రోల్‌మెంట్ అవ్వాలని, చదువు వస్తే గౌరవం వస్తుందని తెలిపారు.

News February 18, 2026

కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

image

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 18, 2026

కర్నూలు: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా నడుస్తాయి.