News December 29, 2024
ఓర్వకల్లులో వ్యక్తి సూసైడ్
ఓర్వకల్లు మండలంలోని కొమ్ముచెరువు అంజన్న ఆలయం వద్ద శివన్న(57) చెట్టుకు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు . స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.
Similar News
News December 31, 2024
రాష్ట్ర స్థాయిలో అస్పరి మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ
విజయవాడలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేశణ పోటీల్లో భాగంగా కౌశల్-2024 పోస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆస్పరి మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి పీ.మహేష్ తృతీయ స్థానంలో నిలిచాడు. మహేశ్‌కు ప్రిన్సిపల్, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు.
News December 30, 2024
మత్తు పదార్థాల నిర్మూలనకు అందరూ సహకరించాలి: కలెక్టర్
మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్తుపదార్థాల నియంత్రణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ జి.బిందు మాధవ్‌తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. విద్యాలయాల పరిసర ప్రాంతాల్లో మత్తుపదార్థాల ఆనవాళ్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 30, 2024
కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ ప్రారంభం
కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇవాళ దేహదారుఢ్య (PMT/PET) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 600 మంది అభ్యర్థులకు గాను 280 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరైనట్లు ఎస్పీ జీ.బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షలకు 10,143 మంది అభ్యర్థులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు PMT/PET పరీక్షల తీరును ఆయన పరిశీలించారు.