News February 6, 2025

ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2026

సీఎం వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన GSDP వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనపై కీలక సమీక్ష నిర్వహించారు. 10 సూత్రాల అమలు, రియల్ టైమ్ గవర్నెన్స్, శాంతిభద్రతల అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

News February 9, 2026

కర్నూలు: ‘37 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

image

కర్నూలు(D) వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ (1988-89 బ్యాచ్) 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అలాగే పలు కారణాలతో మృతి చెందిన మిత్రులకు మౌనం పాటించి, నివాళులర్పించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులను ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు స్మరించున్నారు.

News February 9, 2026

కర్నూలు: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూ!

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 11 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు.