News February 18, 2026

ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తే ఇక కఠిన చర్యలు: VZM SP

image

రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గడ్డి, చెరకు, ఇసుక, గ్రావెల్, సిమెంట్, తదితర సరకులతో ఓవర్‌లోడింగ్ చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఓవర్‌లోడింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

Similar News

News February 19, 2026

VZM: గురుకుల ప్రవేశాల దరఖాస్తుకు మార్చి 3 వరకు గడువు

image

విజయగనగరం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 వరకు గడువు ఉందని జిల్లా కన్వీనర్ డాక్టర్ కేబీబీ రావు తెలిపారు. నెల్లిమర్ల, గంట్యాడ, కొత్తవలస బాలికల పాఠశాలల్లో మొత్తం 160 సీట్లు ఉన్నాయన్నారు. నెల్లిమర్ల (మత్స్యకార), విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి బాలుర పాఠశాలల్లో మొత్తం 200 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

News February 18, 2026

VZM: ‘సివిల్ తగాదాలను ఇరు పక్షాలతో కౌన్సిలింగ్ చేసి పరిష్కరించాలి’

image

రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చే సివిల్ తగాదాల్లో ఇరు పక్షాలను పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే 4వ దశలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 15 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ 11 నాటికి లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.

News February 18, 2026

VZM: సామాన్యులకు రూ.60 లక్షల ప్రమాద బీమా

image

సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ SBI తమ ఖాతాదారులకు ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌’ను తెచ్చినట్లు రీజినల్ మేనేజర్ ఎం. సురేశ్ బాబు తెలిపారు. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయన్నారు. ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.