News June 16, 2024

ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు..!?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి భిన్న వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. అంతలోనే వాతావరణం మారి
ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావాసులు పగలేమో ఎండలకి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. రాత్రిపూట వర్షానికి వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం పొందుతున్నారు.

Similar News

News October 18, 2025

డిప్యూటీ సీఎం భట్టి రేపటి పర్యటన వివరాలు

image

బోనకల్ మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డిప్యూటీ సీఎం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ఇందిరా మహిళా డైరీ లబ్ధిదారుల సమావేశంలో పాల్గొంటారని అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

News October 18, 2025

ఖమ్మం కలెక్టర్‌ను కలిసిన స.హ.చ కమిషనర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ అనుదీప్‌ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, చట్టం నిబంధనలు 4(1)(బి), 6(1) లపై పౌర సమాచార అధికారులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం మార్గం తదితర అంశాలపై కమిషనర్.. కలెక్టర్‌తో చర్చించారు.

News October 18, 2025

ఖమ్మం: బందోబస్త్‌ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

image

బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీంచారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.