News November 23, 2025
ఓవైపు CBN, రేవంత్.. మరోవైపు జగన్, KTR

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రెండు కీలక దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో AP CM చంద్రబాబు, TG CM రేవంత్ ఒకే వేదికను పంచుకున్నారు. అదే సమయంలో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కు AP మాజీ CM వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి KTR కలిసి హాజరయ్యారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారి తీశాయి.
Similar News
News November 23, 2025
నిర్మల్: భవితా కేంద్రాల్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

మండల కేంద్రాల్లోని భవితా కేంద్రాల్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఫిజియో థెరపిస్ట్(8), స్పీచ్ థెరపిస్ట్(8), ఆయా(కేర్ గివింగ్ వాలంటీర్)(10) పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన వారు ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు బయోడాటా, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్, 2 పాస్పోర్ట్ ఫొటోలను డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.
News November 23, 2025
సత్యసాయి ఎప్పటికీ జీవించే ఉంటారు: విజయ్ దేవరకొండ

సత్యసాయి బాబాకు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.
News November 23, 2025
రోజూ నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌తో సతమతమవుతున్న వారికి నవ్వు ఉత్తమ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి, మనసుకు అపారమైన లాభాలు కలుగుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్-2 డయాబెటిస్‌ను, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు సహజ పెయిన్‌కిల్లర్‌లా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.


