News October 24, 2025
ఓస్లో సదస్సుకు హాజరు కానున్న ఏలూరు ఎంపీ

నార్వే ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరుకానున్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నార్వే ప్రభుత్వ సహకారంతో ఓస్లోలో నవంబర్ 2 నుంచి 8 వరకు సదస్సు నిర్వహిస్తున్నారు. భారతదేశం తరఫున హాజరయ్యే ఎంపీల బృందంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. గత నెల 24న ఆహ్వానం అందినట్లు ఎంపీ గురువారం తెలిపారు.
Similar News
News October 24, 2025
కర్నూలు: ALL THE BEST సాదియా

పంచలింగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగబోయే 69వ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాఠశాల చెందిన సాదియా తబస్సుమ్ 48 కేజీల వెయిట్ కేటగిరిలో పాల్గొంటున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు మాలిక్ తెలిపారు.
News October 24, 2025
సిరిసిల్ల: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

దివ్యాంగ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇంటర్, ఒకేషనల్, ప్రొఫెషనల్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు https://scholarships.gov.in/ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 24, 2025
KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్‌పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.