News August 20, 2024

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి: కలెక్టర్

image

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా లోన్ మేళాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్పెషల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి మేళాలు ఏర్పాటు చేసినట్లే లోన్ మేళాను నిర్వహించాలన్నారు.

Similar News

News February 21, 2026

ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రతిజ్ఞతో ప్రారంభించారు. ‘జీరో లిటర్ గవర్నెన్స్’ థీమ్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ‘జీరో-వేస్ట్’ జీవనశైలి అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, సిబ్బంది స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని ఆమె కోరారు.

News February 20, 2026

పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 20, 2026

కర్నూలు: రెండు వారాల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

image

కర్నూలు(D) గోనెగండ్ల మండలం ఐరన్ బండకు చెందిన టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ బోయ నీలకంఠ(30) నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. మార్చి 5, 6వ తేదీలలో వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘటనతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. నీలకంఠ మృతి పట్ల టీడీపీ మండల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.