News February 7, 2025

కంకిపాడులో యువకుడి సూసైడ్

image

కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు మానేశాడని ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Similar News

News February 7, 2025

రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు మృతి

image

ప.గో జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయారు. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్‌బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.

News February 7, 2025

బైక్ చక్రంలో చీర ఇరుక్కొని మహిళ మృతి: ఎస్సై చంటిబాబు

image

చీర బైక్ చక్రంలో చిక్కుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన గుడివాడ రూరల్ ప్రాంతంలో జరిగింది. సెరికలవపూడి గ్రామానికి చెందిన కోన నాగేశ్వరరావు భార్య కోన నాగమల్లేశ్వరి బంధువుల దిన కార్యక్రమానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో నూజెండ్ల గ్రామం వద్ద వారు వెళుతున్న బైక్ చక్రంలో చీర చిక్కుకొని ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై చంటిబాబు తెలిపారు.

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. కొల్లు రవీంద్రకు 12వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర 12వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

error: Content is protected !!