News May 11, 2024

కంకిపాడులో యువతి ఆత్మహత్య

image

అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల మేరకు కంకిపాడు పులిరామారావు వీధికి చెందిన శ్రావ్య ఐదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోందన్నారు. ఎన్ని మందులు వాడిన ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

Similar News

News February 28, 2026

కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.

News February 28, 2026

కృష్ణా: పర్యావరణ పరిరక్షణకు కలెక్టర్ పిలుపు

image

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజి శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ కోసం ప్రతి శనివారం ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ ద్వారానే కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కడం అందరిలోనూ స్ఫూర్తిని నింపింది.

News February 28, 2026

మినుము, పెసల కొనుగోలుకు సర్వం సిద్ధం: కృష్ణా జిల్లా జేసీ

image

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ శుక్రవారం ప్రకటించారు. క్వింటా మినుములకు రూ.7,800, పెసలకు రూ. 8,768 మద్దతు ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం ద్వారానే విక్రయాలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.