News April 13, 2024
కంకిపాడులో వివాహిత ఆత్మహత్య
ఈడుపుగల్లులో శ్రీపతి శ్రావ్య (25)అనే వివాహిత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావ్య డైరీ కనిపించడం లేదని, ఆ డైరీని స్వాధీనం చేసుకుంటే నిజాలు బయటకు వస్తాయని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 23, 2025
కృష్ణా: యూజీ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2024లో నిర్వహించిన యూజీ 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 3వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.800 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.
News January 22, 2025
ప్రకృతి వ్యవసాయం దిశగా ముందడుగు వేయాలి: కలెక్టర్
సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంతో రైతులను చేయిపట్టి నడిపిస్తోందని కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, దాములూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఎలా ఉంది.? సాగుచేస్తున్న పంటలు గురించి అడిగి తెలుసుకున్నారు.
News January 22, 2025
దుర్గగుడి ప్రధానార్చకులు మృతి
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.