News April 22, 2024

కంకిపాడు: యువతి కోసం ఘర్షణ.. గాయాలు

image

కంకిపాడు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి విషయమై ముగ్గురు యువకులు ఘర్షణ పడినట్లు తెలిపారు. వణుకూరు, ఉయ్యూరు గ్రామాలకు చెందిన యువకులు బీరు బాటిళ్లతో జాతీయ రహదారి సమీపంలో దాడులు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు గాయాల పాలవగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

Similar News

News December 24, 2024

కృష్ణ: కారు ఢీ కొని.. ప్రభుత్వ టీచర్ దుర్మరణం

image

మండలంలోని పెడసనగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.రామకృష్ణను సోమవారం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద కారు ఢీ కొట్టింది. గాయాలపాలైన ఆయనను సిటీ న్యూరో సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స అందుతుండగా ఆయన మంగళవారం మరణించారని మొవ్వ మండల ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News December 24, 2024

విజయవాడ: ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

image

ఈవీఎంల భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సాధారణ తనిఖీలలో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి అందిస్తామమన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

News December 24, 2024

పేర్ని నాని పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు

image

రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో వేసిన పిటిషన్ న్యాయమూర్తి కొట్టివేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తూ పేర్ని నాని పిటిషన్ వేయగా దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టి వేశారు. కాగా ఈ కేసులో 2వ నిందితుడిగా ఉన్న మానస తేజ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ Jan 2కి వాయిదా పడింది.