News February 16, 2025

కంకిపాడు: వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడులో ఉంటున్న వెంకటస్వామి ఈనెల 14న రాత్రి వాకింగ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య కొందరితో కలిసి సాయంత్రం వెతకగా రోడ్డు పక్కన చనిపోయి కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Similar News

News December 18, 2025

గన్నవరంలో విమానాలు ల్యాండింగ్‌కి అంతరాయం

image

గన్నవరంలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ ప్రభావంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడింది. బెంగళూరు నుంచి గన్నవరం చేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే క్లియరెన్స్ లేక గాల్లో చక్కర్లు కొట్టింది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

News December 17, 2025

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో కృష్ణా జిల్లాకే అగ్రస్థానం.!

image

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం దక్కించుకుంది. మంగళవారం వరకు జిల్లాలో 3,83,127 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు. 49,132 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటికే 47,182 మంది రైతులకు రూ. 864.72 కోట్లు జమ చేశారు. మిగిలిన రైతులకు త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు వివరించారు.

News December 17, 2025

కృష్ణా: గొబ్బెమ్మల పూజలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి షురూ

image

ధనుర్మాసం ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు మంచును సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే ఆవు పేడతో సంప్రదాయ గొబ్బెమ్మలు తయారు చేసి, గృహాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో గొబ్బెమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.