News September 5, 2025
కంగ్టి: గణేశ్ లడ్డూ సొంతం చేసుకున్న ముస్లింలు యువకుడు

కంగ్టి మండలం వడగావ్‌లో ఓ ముస్లిం యువకుడు గణేశ్ లడ్డూను వేలం పాట పాడి సొంతం చేసుకున్నాడు. శుక్రవారం గ్రామంలోని దాత గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పూజలు అందుకున్న గణేశ్ చేతిలోనే లడ్డూను వేలం వేయగా గ్రామానికి చెందిన రహీం రూ.23 వేలకు సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు సాయిబాబా ఆలయంలో లడ్డును అందజేశారు.
Similar News
News September 6, 2025
జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి ఎమ్మెల్సీ రమణ

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటికి ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ శుక్రవారం వెళ్లారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎడమ కాలు ఇటీవల ఫ్రాక్చర్ కాగా జగిత్యాలలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు సతీశ్, దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.
News September 6, 2025
కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

TG: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం చేసేందుకు సీఎంతో కలిసి ప్రధానిని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు కూడా విమర్శించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.
News September 6, 2025
ADB రిమ్స్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌లో వైద్య విద్య చదువుతున్న 2021 విద్యార్థులు.. వైద్యులను ఆడిటోరియంలో సత్కరించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సైతం వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, వైద్యులు సందీప్ జాదవ్, తిప్పే స్వామి, సరోజ, అవినాష్‌రెడ్డి ఉన్నారు