News April 16, 2025

కంగ్టి: రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

image

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలై చికిత్స పొందుతూ మహిళ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాలు.. కంగ్టికి చెందిన నర్సమ్మ(58) గత వారం గ్రామస్థులతో కలిసి రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తమిళనాడు ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వాహనం ఢీ కొట్టడంతో తలకు బలంగా దెబ్బలు తగిలాయి. కోమాలో ఉన్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News December 10, 2025

MNCL: పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏళ్ల శిక్ష

image

పోక్సో కేసులో నిందితుడికి మంచిర్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.12 వేలు జరిమానా విధించారు. సీసీసీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాస్టర్‌గా పనిచేసే బోరెం సాయి సునీల్ 2021లో 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో రుజువైంది. బాధితురాలికి రూ.4 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని జడ్జీ ఆదేశించారు.

News December 10, 2025

VJA: దీక్షా విరమణ.. బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

విజయవాడలో రేపటి నుంచి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమాల నేపథ్యంలో సీపీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాత్రి వేళ స్నాన ఘాట్లు, హోల్డింగ్ ఏరియా, వినాయక ఆలయం వద్ద క్యూలైన్లను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 10, 2025

చందుర్తి: ‘లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలి’

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బందికి ఆయా స్టేషన్లలో ఎస్పీ అవగాహన కల్పించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత పటిష్టం చేయాలని ఎస్పీ ఆదేశించారు.