News April 19, 2025
కంచన్‌బాగ్‌లో అత్యధికం.. ముషీరాబాద్‌లో అత్యల్పం

నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసిన వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ఒక చోట ఎక్కువ వర్షం ఉంటే.. మరో చోట తక్కువ వర్షపాతం నమోదైంది. కంచన్‌బాగ్‌లో అత్యధిక వర్షపాతం 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ముషీరాబాద్‌లో 2.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురలో 7.88 సెం.మీ యాకుత్‌పురలో 7.63, బేగంబజార్లో 6.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Similar News
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News April 20, 2025
HYD: క్రికెట్ బెట్టింగ్ భూతానికి యువకుడి బలి

క్రికెట్ బెట్టింగ్ కారణంగా మియాపూర్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. మియాపూర్ PS పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న గణేశ్(26) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకొవడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
News April 19, 2025
OU: 24 నుంచి బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్‌లో చూసుకోవాలని సూచించారు.