News October 10, 2025
కంచరపాలెం చోరీ కేసులో వీడిన చిక్కుముడి?

కంచరపాలెం ఇందిరానగర్-5 <<17927881>>దొంగతనం కేసు<<>>లో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయినట్లు సమాచారం. బాధిత కుటుంబంలో ఓ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనే పథకం ప్రకారం ఈ దోపిడీకి ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నెల 5 అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యమ్మ(73)నోట్లో గుడ్డలు కుక్కి 12 తులాల బంగారు, కారు, కొంత నగదుతో దుండగలు పరారయ్యారు. కంచరపాలెం క్రైంపోలీసులు కేసును తమైదన శైలిలో విచారిస్తున్నారు.
Similar News
News October 10, 2025
విశాఖ: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

విశాఖ వేదికగా VCA – ADCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12న (ఆదివారం) ఇండియా V/S ఆస్ట్రేలియా ఉమెన్స్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ జరిగిన మ్యాచులో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ చేతిలో ఇండియా ఉమెన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావటంతో అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
News October 10, 2025
విశాఖ: రైతు బజార్లలో స్టాల్‌లకు నోటిఫికేషన్ విడుదల

ఆరిలోవ రైతు బజార్‌లో మొత్తం 11 స్టాళ్లను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డ్వాక్రా మహిళలకు 10, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్‌కి ఒకటి కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 20వ తేదీ లోపు గోపాలపట్నంలో గల మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News October 9, 2025
విశాఖ: ‘డ్వాక్రా మహిళలకు ఈనెల 26 వరకు వైద్య పరీక్షలు’

డ్వాక్రా మహిళలకు సఖి సురక్ష కార్యక్రమం కింద ఈనెల 26 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 35 ఏళ్లు దాటిన మహిళలకు వైద్య పరీక్షలు చేస్తామన్నారు. వైద్య పరీక్షల్లో వ్యాదిని గుర్తించి చికిత్స అందిస్తామని మెప్మా డైరెక్టర్ తేజ భరత్ పేర్కొన్నారు.