News April 25, 2024
కంచర్ల కృష్ణారెడ్డి ఆస్తులు@ రూ.82 కోట్లు!

BRS NLG ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన ఆస్తులు, అప్పుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. తన పేరుపై రూ.82.6కోట్ల స్థిరాస్తులు, చరాస్తులు ఉన్నాయన్నారు. తన భార్య పేరిట రూ.1.6 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. తన వద్ద రూ.88వేలు, భార్య వద్ద రూ.18,600 ఉన్నాయన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.96లక్షల డిపాజిట్లు ఉన్నట్లు చూపారు. భార్య పేరున 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయన్నారు.
Similar News
News September 11, 2025
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712670266కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కళాశాలలు, పాఠశాలల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
News September 11, 2025
పరిశుభ్రతతో అంటురోగాల నివారణ సాధ్యం: కలెక్టర్

నల్గొండ: పరిశుభ్రతతోనే టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలను నివారించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆమె ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో టైఫాయిడ్ జ్వరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
News September 11, 2025
గర్భిణీ స్త్రీల వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వద్దు: ఇలా త్రిపాఠి

గర్భిణీ స్త్రీల వైద్య సేవల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ మండలం రాములబండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హై రిస్క్ ఏఎన్సీ కేసులు, కుక్క కాటుకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, ఈడీడీ క్యాలెండర్, ఆసుపత్రిలో మందుల లభ్యత, మలేరియా, డెంగ్యూ పరీక్షల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.